థియేటర్ల యాజమాన్యాలకు ఊహించని షాకిచ్చిన తలసాని

  • IndiaGlitz, [Wednesday,May 08 2019]

కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవచ్చన్న హైకోర్టు ఆదేశాల మేరకు థియేటర్ల యాజమాన్యాలు అనుకున్నట్లుగానే టికెట్లు పెంచేశాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా విడుదల సందర్భంగా సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో 80 నుండి 110 రూపాయలు, మల్టిఫ్లెక్స్ థియేటర్‌లలో 138 నుండి 200 రూపాయల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచేశాయి. టికెట్ల ధరలు పెంపుతో అభిమానులు, సినిమా లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సర్కార్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.

బుధవారం మధ్యాహ్నం సీఏస్, హోం సెక్రటరీ, లా సెక్రటరీతో సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సమీక్ష నిర్వహించారు. సినిమా టికెట్ల ధరలు ఏక పక్షంగా పెంచడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా సినిమా టికెట్ ధరలు పెంచడమేంటి..? అంతా మీ ఇష్టమేనా అంటూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే థియేటర్ల యాజమాన్యాలు మాత్రం కోర్టు ఉత్తర్వుల మేరకే టిక్కెట్ ధరలు పెంచామని చెబుతున్నాయి. అయితే థియేటర్ల యాజమాన్యం తీరుపై కన్నెర్రజేసిన సర్కార్.. హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది.

ఎస్.. కోర్టుకెళ్తున్నాం..

సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరల పెంపు అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.. కోర్టు డైరెక్షన్ వల్ల నిన్న థియేటర్ వాళ్లు వాళ్లంతట వాళ్లే రేట్లు పెంచినట్లు వార్తలు విన్నాం ఇది సబబు కాదన్నారు. డైరెక్షన్‌తో 79 థియేటర్లు రేట్లు పెంచినట్లు మా దృష్టికి వచ్చిందని సామాన్యులు కూడా సినిమా చూడాలంటే రేట్లు తక్కువగానే ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. నిన్న ఒక మీడియాలో వచ్చిన కథనాలు చూసి తాను రియాక్ట్ అయ్యానన్నారు. ఇవాళ హోమ్, లా కార్యదర్శితో మాట్లాడి నిశితంగా చర్చించామన్నారు. ప్రభుత్వం ఎక్కడ రేట్లు పెంచమని చెప్పలేదని.. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వానికి లేదన్నారు. ఫైనల్‌గా మేము కోర్టులో పిటిషన్ వేస్తామని మంత్రి తలసాని తేల్చిచెప్పారు.

మొత్తానికి చూస్తే మంగళవారం సాయంత్రం మొదలైన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వం పిటిషన్ వేస్తే పరిస్థితేంటి..? గతంలో టికెట్లు పెంచుకోవచ్చని కోర్టు చెప్పినట్లుగానే పాటిస్తుందా..? లేకుంటే థియేటర్ల యాజమాన్యాలకు మొట్టికాయలేస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

More News

జూన్ మొద‌టి వారంలో 'కిల్ల‌ర్' విడుద‌ల‌

విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం కొలైగార‌న్. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్ ఈ చిత్రాన్ని త‌మిళంలో నిర్మించింది.

రాజ్‌తరుణ్‌తో నిత్యామీన‌న్‌

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ ఇప్పుడు దిల్‌రాజు బ్యాన‌ర్‌లో 'ఇద్ద‌రిదీ ఒక‌టే లోకం' సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. ఇప్పుడు కె.కె.రాధామోహ‌న్ నిర్మాణంలో మ‌రో సినిమా

కుమార్తె ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన య‌ష్‌

'కె.జి.ఎఫ్‌'తో క‌న్నడ సినిమా మార్కెట్ రేంజ్‌ను నేష‌న‌ల్ వైడ్ చేసిన హీరో య‌శ్‌. ఈయ‌న ప్ర‌స్తుతం 'కె.జి.ఎఫ్' రెండో భాగంగా 'కె.జి.ఎఫ్ 2'లో ఈయ‌న హీరోయిన్ రాధిక‌ను పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

రీషూట్‌లో స్టార్ హీరోయిన్ చెల్లెలి సినిమా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ కుటుంబం నుండి మ‌రో హీరోయిన్ సినీ ఎంట్రీ ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆమె ఎవ‌రో కాదు.. ఇషా బెల్లె కైఫ్‌.

'కిక్ 2'లో దీపికా ప‌దుకొనె

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్‌, దీపికా ప‌దుకొనె కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమానే రాలేదు. అదేంటి స్టార్ హీరోయిన్స్ అంద‌రితో స‌ల్మాన్‌ఖాన్ ఆడిపాడాడు క‌దా!