తలసాని శ్రీనివాస్ చేతుల మీదుగా ఆదాశర్మ` ?`క్వచ్చన్ మార్క్ పోస్టర్ లాంచ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో నిర్మించబడుతున్న చిత్రం క్వశ్చన్ మార్క్ (?). ఈ చిత్రం పోస్టర్ లాంచ్ ఈ రోజు తలసాని శ్రీనివాస్ చేతుల మీదుగా ఆయన నివాసంలో జరిగింది.
అనంతరం ఆయన మాట్లాడుతూ... కరోన వల్ల ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ కరువైంది. ఇలాంటి తరుణంలో ఒక మంచి మెసేజ్ తో వస్తోన్న ఈ చిత్రం విజయం సాధించి దర్శక నిర్మాతలకు హీరోయిన్ కు మరియు ఇతర యూనిట్ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ...``కరోనా టైమ్ లో ప్రారంభించి షూటింగ్ ఫినీష్ చేశాం. కరోన వల్ల ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితిలో మా హీరోయిన్ ఆదాశర్మ మా సినిమా షూటింగ్ కోసం సహకరించారు. మా దర్శకుల ప్లానింగ్ వల్లే క్రిటికల్ సిట్యుయేషన్ లో సినిమాను అనుకున్నవిధంగా తీయగలిగాం.మా టీమ్ అంతా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సహకరించడం వల్లే ఈ రోజు మా సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఈ రోజు మా సినిమా పోస్టర్ తలసాని శ్రీనివాస్ గారు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం`` అన్నారు.
దర్శకులు విప్రా మాట్లాడుతూ...``తలసాని గారు మా సినిమా పోస్టర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీ. కరోనా టైమ్ లో మా సినిమా షూటింగ్ కి సహకరించిన ఆదాశర్మ గారికి మా నిర్మాత గౌరికృష్ణ గారికి ధన్యవాదాలు. క్వచ్చన్ మార్క్ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూస్తే ఈ టైటిల్ యాప్ట్ అంటారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది`` అన్నారు.
హీరోయిన్ ఆదాశర్మ మాట్లాడుతూ...``కరోనా టైమ్ లో షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధమవుతోన్న ఫస్ట్ సినిమా మాదే అనుకుంటా. సినిమా చాలా బాగా వచ్చింది, నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతున్నాను. విప్రా పేరుతో ఇద్దరు డైరక్టర్స్ ఈ సినిమా చేస్తున్నారు. వెరీ టాలెంటెడ్ పర్సన్స్. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com