మూవీ టికెట్ రేట్లు పెంచలేదు.. తలసాని క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'మహర్షి' సినిమా మే-09న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. అయితే మహర్షి సినిమాకు గాను రెండు వారాల పాటు టికెట్ల పెంచిందని.. ఇందుకు ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పలు వెబ్సైట్లు, నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు టీవీల్లో పెద్ద పెద్ద బ్రేకింగ్‌లు వేయడంతో సినీ ప్రియులు కంగుతిన్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెవిన పడటంతో ఆయన క్లారిటీ ఇచ్చేశారు.
టికెట్ ధరలు పెంచలేదు..
టికెట్ రేట్లు పెంచినట్టు వస్తున్న వార్తల్లో ఎలాటి నిజం లేదని అవన్నీ అవాస్తవాలేనని మంత్రి తేల్చేశారు. రేట్లు పెంచేందుకు ప్రభుత్వం ఎక్కడా అనుమతి ఇవ్వలేదని తలసాని స్పష్టం చేశారు. సినిమా టికెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి చెప్పారు. ప్రభుత్వ అనుమతులతో సింగిల్ స్క్రీన్ థియేటర్లో 80 నుంచి 110 రూపాయలు, మల్టిఫ్లెక్స్ థియేటర్లలో 138 నుంచి 200 రూపాయల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు పలువురు థియేటర్ల యాజమాన్యాలు చెప్పినట్లుగా వివిధ ప్రసార మాధ్యమాలలో చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచిన దాఖలాలు లేవని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం కొనసాగించడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే ఇలా కొందరు పనిగట్టుకుని మరీ నెట్టింట్లో వైరల్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments