పాత్ర కోసం శిక్ష‌ణ తీసుకుంటుంది

  • IndiaGlitz, [Friday,October 06 2017]

తెలుగులో హీరోయిన్ ఝుమ్మందినాదంతో ప‌రిచ‌య‌మైన తాప్సీ చాలా కాలం వ‌ర‌కు మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకోలేదు. రీసెంట్‌గా విడుద‌లైన హార‌ర్ కామెడీ ఆనందో బ్ర‌హ్మా అందుకు మిన‌హాయింపు. అయితే బేబి చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీకి అక్క‌డ మంచి గుర్తింపు వ‌చ్చింది. నామ్ ష‌బానా, పింక్ చిత్రాల‌తో మంచి పెర్ఫామ‌ర్‌గా నిలిచింది. రీసెంట్‌గా విడుద‌లైన జుడ్వా 2లో గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. పాత్ర కోసం ఎలాంటి క‌ష్టానికైనా సిద్ధ‌ప‌డే తాప్సీ ఇప్పుడు హిందీలో ఓ బ‌యోపిక్‌లో న‌టించ‌డం కోసం హాకీ నేర్చుకోవ‌డం విశేషం.

కానీ ఆశ్చ‌ర్య‌పోయే విష‌య‌మేమంటే, ఈ సినిమాలో తాప్సీ కీల‌క‌పాత్ర మాత్ర‌మే పోషిస్తుంది. ప్ర‌ముఖ హాకీ ప్లేయ‌ర్‌, అర్జున అవార్డు గ్ర‌హీత సందీప్ సింగ్ బ‌యోపిక్ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. షాద్ అలీ ద‌ర్శ‌కుడు. సందీప్ పాత్ర‌లో దిల్జీత్ సింగ్ న‌టించ‌నున్నాడు. సందీప్ ప్రియురాలు కూడా హాకీ ప్లేయ‌ర్‌. ఆమె పాత్ర‌లో తాప్సీ క‌నిపించ‌నుంది. ఈ పాత్ర కోసం తాప్సీ శిక్ష‌ణ తీసుకోవ‌డం ఆమె క‌మిట్‌మెంట్‌కు నిదర్శ‌నం. తాప్సీ హాకీ నేర్చుకుంటున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హల్‌చ‌ల్ చేస్తున్నాయి.

More News

వెంకీ రీమేక్‌...

సినిమా ఇండ‌స్ట్రీలో వేరే భాషా చిత్రాలు స‌క్సెస్ అయిన‌వీ, మంచిక‌థా చిత్రాల‌ను రీమేక్ చేస్తుంటారనే సంగ‌తి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో విడుద‌లై విజ‌యం సాధించిన హిందీ మీడియం సినిమా మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.

పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కి 'కొమరం భీమ్' జాతీయ పురస్కారం

తెలంగాణ టెలివిజన్  డెవలప్మెంట్  ఫోరమ్, ఆదివాసి సాంసృతిక పరిషత్, గోండ్వానా కల్చరల్ ప్రొటెక్స్టైన్ ఫోర్స్, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా ప్రతి ఏడాది అందించే ప్రతిష్టాత్మక "కొమరం భీమ్ జాతీయ  పురస్కారం" 2017 గాను కొమరం భీమ్ వర్ధంతి(అక్టోబర్ 6న) సందర్భంగా, పీపుల్ స్టార్,  సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తిని ఎంపిక చేసినట్లుగా

రాణి చిత్ర‌లేఖ‌ ర‌చించిన 'వ‌న్నెపూల విన్న‌పాలు' పుస్త‌కావిష్క‌ర‌ణ‌

'క్లాస్ మెట్స్', 'శంభో శివ శంభో', 'పరుగు', 'దమ్ము', లయన్', 'దళం' తదితర చిత్రాల్లో కీలక పాత్రల ద్వారా సిల్వర్ స్ర్కీన్ పై మెరిసిన రాణీ చిత్రలేఖ సుపరిచితురాలే. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై యాంకర్ గా కూడా రాణిస్తున్నారు.

అదే హీరోతో మ‌రోసారి...

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. రీసెంట్‌గా స్పైడ‌ర్ చిత్రంలో మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌నిపించింది. కార్తీ స‌ర‌స‌న ఖాకి సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

'సవ్యసాచి' మ్యూజిక్ డైరెక్టర్ గా...?

అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'సవ్యసాచి'. ఈ నెల రెండో వారంలో సినిమా సెట్స్ లోకి వెళ్లనుంది.