పాత్ర కోసం శిక్షణ తీసుకుంటుంది
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో హీరోయిన్ ఝుమ్మందినాదంతో పరిచయమైన తాప్సీ చాలా కాలం వరకు మంచి విజయాలను సొంతం చేసుకోలేదు. రీసెంట్‌గా విడుదలైన హారర్ కామెడీ ఆనందో బ్రహ్మా అందుకు మినహాయింపు. అయితే బేబి చిత్రంతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీకి అక్కడ మంచి గుర్తింపు వచ్చింది. నామ్ షబానా, పింక్ చిత్రాలతో మంచి పెర్ఫామర్‌గా నిలిచింది. రీసెంట్‌గా విడుదలైన జుడ్వా 2లో గ్లామర్‌తో ఆకట్టుకుంది. పాత్ర కోసం ఎలాంటి కష్టానికైనా సిద్ధపడే తాప్సీ ఇప్పుడు హిందీలో ఓ బయోపిక్‌లో నటించడం కోసం హాకీ నేర్చుకోవడం విశేషం.
కానీ ఆశ్చర్యపోయే విషయమేమంటే, ఈ సినిమాలో తాప్సీ కీలకపాత్ర మాత్రమే పోషిస్తుంది. ప్రముఖ హాకీ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత సందీప్ సింగ్ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. షాద్ అలీ దర్శకుడు. సందీప్ పాత్రలో దిల్జీత్ సింగ్ నటించనున్నాడు. సందీప్ ప్రియురాలు కూడా హాకీ ప్లేయర్. ఆమె పాత్రలో తాప్సీ కనిపించనుంది. ఈ పాత్ర కోసం తాప్సీ శిక్షణ తీసుకోవడం ఆమె కమిట్‌మెంట్‌కు నిదర్శనం. తాప్సీ హాకీ నేర్చుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com