ఈసారి నానితో చేస్తుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
భలే భలే మగాడివోయ్` చిత్రం తర్వాత యంగ్ హీరో నాని అందాల రాక్షసి` ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. గతంలో రానా హీరోగా హను రాఘవపూడి కవచం` సినిమాని తెరకెక్కించనున్నాడనే టాక్ వినపడింది. అయితే కారణాలు తెలియలేదు కానీ ఆ సినిమా స్టార్ట్ కాలేదు.
ప్రస్తుతం హను రాఘవపూడి నానితో సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించనుందని టాక్. తెలుగు, తమిళంలో రూపొందిన 'గంగ' సినిమా మినహా మరే ఏ చిత్రంలో తాప్సీ హీరోయిన్ గా కనిపించలేదు. బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. ఇంతకీ హనురాఘవపూడి నానితో కవచం` సినిమాని చేస్తాడా, లేదా మరేదైనా కొత్త సబ్జెక్ట్ తో సినిమా చేస్తాడా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments