టఫ్ రోల్ చేస్తున్నానంటున్న తాప్సీ..
Send us your feedback to audioarticles@vaarta.com
ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ ఫెక్ట్, మొగుడు, గుండెల్లో గోదావరి...తదితర చిత్రాల్లో నటించిన అందాల తార తాప్సీ. ఈమధ్య అవకాశాలు లేక తెలుగు తెరకు దూరమయ్యింది. తాజాగా రానా నటిస్తున్న ఘాజీ చిత్రంలో తాప్సీ నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రాన్ని సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. నావికా దళ యుద్దం నేపధ్యంలో రూపొందుతున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో తాప్సీ చాలా టఫ్ రోల్ చేస్తుందట. తన పాత్ర కోసం స్టడీ చేస్తున్నాను అంటూ స్పందనను తెలియచేస్తుంది తాప్సీ. చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటోంది. సరైన సక్సస్ కోసం తపిస్తున్న తాప్సీకి ఈ సినిమా అయినా విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com