తాప్సీ మ‌న‌శ్శాంతికి కార‌ణం అదే!

  • IndiaGlitz, [Saturday,October 06 2018]

మ‌న‌సులో ఒక‌టి పెట్టుకుని పైకి మ‌రొక‌టి మాట్లాడ‌టం నాకు చేత‌కాదు. అందుకే ఎప్పుడైనా నాకు ఏద‌నిపిస్తే అది మాట్లాడుతాను. నా మ‌న‌సు స్వ‌చ్ఛంగా ఉంటుంది. అందుకే మాన‌సికంగా ప్ర‌శాంతంగా నిద్ర‌పోతాను అని అంటున్నారు తాప్సీ. సామాజికంగా ఎలాంటి ఇష్యూస్ వ‌చ్చినా వెంట‌నే స్పందించే తాప్సీ తాజాగా త‌నుశ్రీ ద‌త్తాకు సంబంధించిన అంశంపై కూడా నోరు విప్పారు.

ద‌శాబ్దం క్రితం త‌ను శ్రీ ద‌త్తా ఎలాంటి వేద‌న‌కు గుర‌య్యారో తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని ఆమె అన్నారు. ప‌దేళ్ల త‌ర్వాత ఎందుకు ఈ విష‌యాన్ని చెప్పాల్సి వ‌చ్చింద‌ని అంద‌రూ త‌నుని ప్ర‌శ్నించ‌డం బాగోలేదు. ఆమె అప్పుడు ఎదుర్కొన్న విష‌యాల గురించి నోరు విప్పి మాట్లాడ‌గ‌ల హ‌క్కు ఆమెకు ఎప్ప‌టికీ ఉంది. అందులో త‌ప్పేం లేదు. ఆధారాలున్న‌ప్పుడు ఇంకో 40 ఏళ్ల త‌ర్వాత ఇలాంటివి మాట్లాడినా త‌ప్పులేదు అని చెప్పారు తాప్సీ.