తాప్పీకి చేదు అనుభవం
- IndiaGlitz, [Monday,May 06 2019]
హీరో తాప్సీ పన్నుకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఇంతకు అదెక్కడో తెలుసా! ఎయిర్ ఇండియా విమానంలో. ఇటీవల ఆమె ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించారు.
ఆ విమానంలోని సిబ్బంది పనితీరు తాప్సీకి ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేసింది. దీంతో ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ఎయిర్ ఇండియా సిబ్బంది పనితీరు గురించి తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
దీనిపై ఎయిర్ ఇండియా యాజమాన్యం స్పందిస్తూ .. ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలిగిందో చెప్పమని కోరింది. అయితే తాప్సీ తాను చెప్పనని, నన్ను అసౌకర్యానికి గురి చేసిన మీ సిబ్బందినే అడిగి తెలుసుకోండి అంటూ బదులిచ్చింది.