తాప్పీ ..ఇది చాలా తప్పు...
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శతాధిక దర్శకుడిగా ఎన్నో కమర్షియల్ హిట్స్‌ను అందించిన ఘనత దర్శకేంద్రుడిది. తన సినిమాల్లోని హీరోయిన్స్‌ను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావుది ప్రత్యేకమైన శైళి. పువ్వులు, పళ్లతో హీరోయిన్ నాభి అందాలను తెరపై చూపించడంలో దర్శకేంద్రుడు స్పెషలిస్ట్. అందుకే రాఘవేంద్రుడి సినిమాలో నటించాలని చాలా మంది హీరోయిన్స్ అనుకునేవారు. కానీ తాప్సీ మాత్రం రాఘవేంద్రుడి సృజనపై కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ ఛానెల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ .. శ్రీదేవి, జయసుధ వంటి హీరోయిన్స్‌ను పరిచయం చేసిన దర్శకుడాయన. నాభిపైనే తొలి సాంగ్ చిత్రీకరణ ప్రారంభమైంది. నా నాభిపై కూడా పూలు, పళ్ళను కూడా విసురుతాడేమోనని అనుకున్నాను. కానీ అందుకు బదులుగా ఆయన టెంకాయ విసిరారు. అందులో అందమేంటో నాకు అర్థం కావడం లేదు. అంది. దాంతో స్టేజ్‌పై సాంగ్‌ను ప్లే చేశారు. షో హోస్ట్‌లు, ఆడియెన్స్ విరగబడి నవ్వుకున్నారు. అయితే చాలా మంది మాత్రం తాప్సీ చర్యను తప్పు పట్టారు. రాఘవేంద్రరావు ఏం చెప్పకుండా చేయడు. తనకు నచ్చన్నప్పుడు చేయాల్సిన అవసరం లేదు. అంతా చేసి ఇప్పుడు కామెంట్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments