సినిమా కోసం తాప్సీ బెంగాలీ నేర్చుకుంది
Send us your feedback to audioarticles@vaarta.com
దగ్గుబాటి రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఘాజీ. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో నిర్మించిన ఈ చిత్రం 1971 బ్యాక్‌డ్రాప్‌లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్‌వాటర్‌లో జరిగిన యుద్ధనౌక పేరే ఘాజీ. ఈ సినిమాలో తాప్సీ ఓ కీలకపాత్రలో నటించింది.
కథలో బెంగాలీ క్రూ మెంబర్‌గా తాప్సీ పాత్ర ఉండటంతో పాత్ర కోసం తాప్సీ ఓ బెంగాలీ ట్యూటర్‌ను పెట్టుకుని బెంగాళీ భాషపై పట్టుసాధించింది. అలాగే బెంగాళీ సినిమాలను కూడా చూసిందట. హాలీవుడ్ స్టాండర్డ్ టెక్నికల్వర్క్తోభారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments