బిగ్ బాస్ షోలో సందడి చేసిన తాప్సీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఆనందో బ్రహ్మ ప్రమోషన్స్ లో భాగంగా ఢిల్లీబ్యూటీ తాప్సీ పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొన్నారు. తాజాగా లోనావల లో ఉన్న బిగ్ బాస్ హౌస్ ని సందర్శించిన తాప్సీ అక్కడ ఉన్న పార్టిస్పెంట్స్ తో కలిసి సందడి చేశారని ఆనందో బ్రహ్మ నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి తెలిపారు. ఆగస్ట్ 18న కామెడీ హారర్ ఎంటర్ టైనర్ ఆనందో బ్రహ్మ విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా కథకి తగ్గట్లుగా ఓ డిఫరెంట్ గెటెప్ తో తాప్సీ బిగ్ బాస్ హౌస్ ని సందర్శించినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
స్టార్ మా ఛానల్ వారు నిర్వహిస్తున్న ఈ షోలో తాప్సీ పాల్గొన్న ఎపిసోడ్ ఆగస్ట్ 17 రాత్రి తొమ్మిదిన్నరికి ప్రసారం అవుతుంది. జూనియర్ యన్టీఆర్ ఈ షోని హొస్ట్ చేస్తున్నారు. ఇక తాప్సీ మెయిన్ లీడ్ గా స్టార్ కమీడియన్లు వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పాఠశాల ఫేమ్ మహి.వి.రాఘవ్ దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ : అనీష్ తరుణ్ కుమార్, మ్యూజిక్ : కే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com