మరో బయోపిక్.. కన్‌ఫర్మ్ చేసిన తాప్సీ
- IndiaGlitz, [Tuesday,December 03 2019]
సొట్టబుగ్గల సుందరి తాప్సి శాండ్‌కీ అంఖ్ సినిమా కోసం షూటర్‌గా మారారు. అది కూడా వయసు మళ్లిన షూటర్‌గా. ఇదొక బయోపిక్. ఇప్పుడు మరోసారి మరో బయోపిక్‌లో నటించబోతున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రముఖ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్‌ను 'శభాష్ మిత్తు' పేరుతో తెరకెక్కించబోతున్నారు. ఈరోజు మిథాలీ రాజ్ పుట్టినరోజు ఈ సందర్భంగా తాప్సీ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'హ్యాపీ హ్యాపీ బర్త్ డే కెప్టెన్ మిథాలీ రాజ్..ఎన్నో విషయాల్లో నువ్వు మమ్మల్ని గర్వపడేలా చేశావు. ఈ పుట్టినరోజుకు నీకు నేను ఎలాంటి బహుమతి ఇవ్వగలనో లేదో కానీ.. శభాష్ మిత్తు ద్వారా నిన్ను నువ్వు వెండితెరపై చూసుకుని గర్వపడతావు. నీ పాత్రకు నన్ను ఎంపిక చేయడం నాకెంతో గర్వంగా ఉంది' అంటూ మిథాలీరాజ్‌తో దిగిన ఫొటోలను తాప్సీ మెసేజ్ చేసింది.
రాహుల్ డోలాకియా దర్శకత్వంలో వయాకామ్ 18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే తాప్సీ ఈ సినిమా కోసం క్రికెట్‌ను స్పెషల్‌గా నేర్చుకోబోతున్నారట. మరెప్పుడూ తాప్సీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుందో ఏమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కెరీర్ ప్రారంభంలో తెలుగులో ప్లాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్‌లో బేబీ, నామ్ షబానా, బద్లా వంటి చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. సుర్మ, శాండ్ కీ అంక్ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు శభాష్ మిత్తుతో మెప్పించనుంది.