మంత్రిపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ ప్రభుత్వం కొత్త తీసుకు రావాలనుకుంటున్న రైతు చట్టాలపై పోరాటం చేస్తున్న రైతుల్లో కొందరు కన్నుమూశారు. ఈ వ్యవహారంపై హర్యానా వ్యవసాయ శాఖా మంత్రి జేపీ దలాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ తాప్సీ ట్వట్టర్ వేదికగా మంత్రిని ఏకేసింది. ఇంతకీ జేపీ దలాల్ రైతులను ఏమన్నాడో తెలుసా? ‘‘"కొన్ని లక్షల మందిలో రెండు వందల మంది చనిపోరా.. ఇంట్లో ఉండి ఉంటే వాళ్లు చనిపోకుండా ఉంటారా? వాళ్లు తమ ఇష్టపూర్వకంగానే చనిపోయారు" అంటూ దలాల్ అన్నాడు. దీనిపై తాప్సీ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించింది. "మనిషి జీవితానికి విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా మన ఆకలి తీరుస్తున్న రైతుల జీవితానికి విలువ లేదు. అన్నదాల మరణాలను అపహాస్యం చేస్తున్నారు" అని కౌంటర్‌గా సమాధానం చెప్పింది తాప్సీ.
తర్వాత తాను మాట్లాడిన తీరుపై అందరూ కోపంగా ఉన్నారని గ్రహించిన జేపీ దలాల్ క్షమాపణలు చెప్పుకున్నాడు. ఎంత క్షమాపణలు చెప్పినా ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడుతాడని అందరూ అనుకుంటున్నారు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments