నీవల్లైతే చేస్కో... నెటిజెన్ కు తాప్సి సవాల్
Send us your feedback to audioarticles@vaarta.com
తాప్సీ ఎక్కడా తగ్గడం లేదు. ఆ మాటకొస్తే జర అగ్రెసివ్‌గానే ముందుకు వెళ్తోంది. అవతలి వ్యక్తి ఎవరూ ఏంటి? అన్నది పట్టించుకోకుండా `నీవల్లైతే చూస్కో.. చేస్కో` అని అంటోంది. ఇంతకీ తాప్సీ అలా ఎందుకలా అన్నట్టు... దానికీ ఓ కారణం ఉంది. బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో ఆమె ఓ సినిమాకు సంతకం చేశారు. మంచి పని మంచి విందుతో మొదలైందని అనుభవ్ సిన్హాతో కలిసి ఆమె భోజనం చేస్తున్న ఫొటో కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. దానికి ఓ నెటిజన్ వ్యతిరేకంగా స్పందించారు.
అనుభవ్ సిన్హాను ఉద్దేశించి.. తాప్సీకి నటించడం రాదనీ, ఇంకొక చాయిస్ చూసుకోమనీ సలహా ఇచ్చాడు. దీంతో తాప్సీకి చాలా కోపం వచ్చింది. ` ` ఈ సినిమాకు నేను ఆల్రెడీ సైన్ చేసేశాను. ఇప్పుడు నన్ను తీసేయడం కుదరదు. వీలైతే ఒక పనిచెయ్. నన్ను నెక్స్ట్ ఎవరు కలవాలనుకుంటున్నారో, ఎవరు కథ చెప్పాలనుకుంటున్నారో తెలుసుకో. వీలైతే వెళ్లి వాళ్లకు రెకమండ్ చెయ్యి. నీవల్లైంది చేసుకో చూద్దాం`` అంటూ సవాలు విసిరారు. మిగిలిన ఫ్యాన్స్ కూడా తాప్సీకే మద్దతు పలికారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments