నీవల్లైతే చేస్కో... నెటిజెన్ కు తాప్సి సవాల్

  • IndiaGlitz, [Monday,July 08 2019]

తాప్సీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఆ మాట‌కొస్తే జ‌ర అగ్రెసివ్‌గానే ముందుకు వెళ్తోంది. అవ‌త‌లి వ్య‌క్తి ఎవ‌రూ ఏంటి? అన్న‌ది ప‌ట్టించుకోకుండా 'నీవ‌ల్లైతే చూస్కో.. చేస్కో' అని అంటోంది. ఇంత‌కీ తాప్సీ అలా ఎందుక‌లా అన్న‌ట్టు... దానికీ ఓ కార‌ణం ఉంది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనుభ‌వ్ సిన్హా ద‌ర్శ‌క‌త్వంలో ఆమె ఓ సినిమాకు సంత‌కం చేశారు. మంచి ప‌ని మంచి విందుతో మొద‌లైంద‌ని అనుభ‌వ్ సిన్హాతో క‌లిసి ఆమె భోజ‌నం చేస్తున్న ఫొటో కూడా ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. దానికి ఓ నెటిజ‌న్ వ్య‌తిరేకంగా స్పందించారు.

అనుభ‌వ్ సిన్హాను ఉద్దేశించి.. తాప్సీకి న‌టించ‌డం రాద‌నీ, ఇంకొక చాయిస్ చూసుకోమ‌నీ స‌ల‌హా ఇచ్చాడు. దీంతో తాప్సీకి చాలా కోపం వ‌చ్చింది. ' ' ఈ సినిమాకు నేను ఆల్రెడీ సైన్ చేసేశాను. ఇప్పుడు న‌న్ను తీసేయ‌డం కుద‌ర‌దు. వీలైతే ఒక ప‌నిచెయ్‌. న‌న్ను నెక్స్ట్ ఎవ‌రు క‌ల‌వాల‌నుకుంటున్నారో, ఎవ‌రు క‌థ చెప్పాల‌నుకుంటున్నారో తెలుసుకో. వీలైతే వెళ్లి వాళ్ల‌కు రెక‌మండ్ చెయ్యి. నీవ‌ల్లైంది చేసుకో చూద్దాం'' అంటూ స‌వాలు విసిరారు. మిగిలిన ఫ్యాన్స్ కూడా తాప్సీకే మ‌ద్ద‌తు ప‌లికారు.

More News

చెర్రీ... ఇన్‌స్టాగ్రామ్‌లో చేరీ!

చెర్రీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. ఇక‌పై వ‌రుస‌గా పిక్స్ పోస్ట్ చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కేవ‌లం ఫేస్‌బుక్‌లోనే ఉన్నారు.

హార‌ర్‌ను మించిన ఎమోష‌న్ సినిమాలోఉంది! - సందీప్ కిషన్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక.

ఈనెల 27న విశాల్‌ 'అయోగ్య' తెలుగులో గ్రాండ్‌ రిలీజ్‌

విశాల్‌ హీరోగా  తమిళంలో రూపొందిన చిత్రం 'అయోగ్య'. తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది.

జులై 19న 'మిస్ట‌ర్ కెకె' రిలీజ్

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌, అభిహాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వం లో

చార్మి డిస్కౌంట్ ఇస్తానంటోంది

చార్మింగ్ చార్మి డిస్కౌంట్ ఇస్తానని అనాలేగానీ, కుర్ర‌కారు ఎగ‌బ‌డ‌కుండా ఉంటారా? త‌మ‌కు న‌చ్చింది చేజిక్కించుకోకుండా ఉంటారా?