తాప్సీ మరో హర్రర్ మూవీ...
Send us your feedback to audioarticles@vaarta.com
`సాహసం` తర్వాత మరో తెలుగు సినిమాలో తాప్సీ నటించలేదు. బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా మారిపోయిన తాప్సీ ఇప్పుడు ఘాజీ అనే త్రిభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా తర్వాత మరో తెలుగులో సినిమాలో కూడా తాప్సీ నటించబోతుంది.
హర్రర్ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాను మహి కె.రాఘవ్ డైరెక్ట్ చేయనున్నాడు. దెయ్యాల్నే భయపెట్టే పాత్రలో తాప్సీ నటిస్తుంది. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన తాప్సీ తర్వాత షాడో, మిష్టర్ పర్‌ఫెక్ట్, వీర, సాహసం సహా పలు చిత్రాల్లో నటించిన తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. మరిప్పుడు ఈ సినిమాతో మరి టాలీవుడ్‌లో తాప్సీ బిజీ అవుతుందేమో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com