'శ్రీదేవి' మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు - డా.టి. సుబ్బరామి రెడ్డి

  • IndiaGlitz, [Monday,February 26 2018]

'శ్రీదేవి' హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసింది. నమ్మలేకపోతున్నాను. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలు, ఆప్తురాలు. ఎన్నో సినీ వేడుకలకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేవారు. ఆమె మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. 'వేటగాడు', 'ప్రేమాభిషేకం' ,'జగదేకవీరుడు అతిలోకసుందరి' వంటి ఎన్నో తెలుగు చిత్రాలు బాలీవుడ్ లో యాష్ చోప్రా తాము రూపొందించిన 'చాందిని', 'అలాగే లమ్హే' చిత్రాలు శ్రీదేవి నటజీవితానికి ఎంతో వన్నె తెచ్చాయి. ఆమె కీర్తిని దశ,దిశలా వ్యాపింప చేశాయి.

నిన్నగాక మొన్న 'మామ్‌' గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీదేవి హఠాత్తుగా మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదన్నా సన్నివేశం ఇస్తే ఇలా చేయాలా? అలా చేయాలా? అని రిహార్సల్స్‌ చేసుకోకుండా అలా పాత్రను అర్థం చేసుకుని సహజంగానే నటించేస్తారు. అందుకే శ్రీదేవి స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయాలేరని అంటుంటారు.

అభిమానుల్లో ఆమెకున్న పేరు అంతా ఇంతా కాదు.బాల నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన శ్రీదేవి అంచెలంచెలుగా స్టార్‌ కథానాయికగా ఎదిగారు. శ్రీదేవి అప్పటి యువ కథానాయకులతో నటిస్తూనే సీనియర్‌ నటులతోనూ చేసేందుకు ఏమాత్రం సంశయించలేదు. 'బడి పంతులు' చిత్రంలో ఎన్టీఆర్‌ మనవరాలిగా చేసిన శ్రీదేవి.. ఆ తర్వాత ఆయన పక్కన హీరోయిన్‌గా అదరగొట్టేశారు.

ఇక ఏఎన్నార్‌తో పలు చిత్రాల్లో నటించిన ఈ 'అతిలోక సుందరి'ఆ తర్వాతి కాలంలో నాగార్జునతో కూడా నటించడం గమనార్హం. నటనకు వయసు ప్రమాణికం కాదని అప్పట్లోనే తేల్చి చెప్పారు శ్రీదేవి. తన సినీ కెరీర్‌లో 250కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె హఠాత్తుగా ఈలోకాన్ని విడిచి వెల్లడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సాను భూతిని తెలియ జేస్తున్నాను.

More News

మ‌ల్టీస్టార‌ర్ మూవీలో అనుష్క‌?

'భాగమతి' సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు సీనియ‌ర్ క‌థానాయిక‌ అనుష్క. ప్రస్తుతం స్వీటీ కొత్త‌ కథలను వినే క్రమంలో ఉన్నారు.

క‌ళ్యాణ్ రామ్‌ 'నా నువ్వే' ఎప్పుడంటే..

నందమూరి కళ్యాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారిగా క‌లిసి నటిస్తున్న‌ చిత్రం 'నా నువ్వే'. ఇంత‌కుముందు సిద్ధార్థ్, నిత్యా మీనన్, ప్రియా ఆనంద్ కాంబినేష‌న్‌లో '180' వంటి ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించిన జయేంద్ర  ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

"జింకను వేటాడేటప్పుడు పులి ఎంత సైలెంట్‌గా ఉంటాది.. మరి అటువంటిది పులినే వేటాడాలంటే మనం ఇంకెంత సైలెంట్‌గా ఉండాలి".. ఈ డైలాగ్ ను ఎన్టీఆర్, త్రివిక్రమ్ చక్కగా పాటిస్తున్నారు. వీరి కలయికలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఓ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యతో పాటు..

జీవితకథ ఆధారిత(బయోపిక్) సినిమాలంటే..ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయాలు చెబుతారు చూడొచ్చు అనుకుంటారు ప్రేక్షకులు.

కాజల్.. మూడో హ్యాట్రిక్

‘లక్ష్మీకళ్యాణం’(2007)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఉత్తరాది భామ కాజల్ అగర్వాల్.