శింబు, త్రిష పెళ్లిపై టి.రాజేందర్‌ను స్పందన కోరగా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవలి కాలంలో శింబు, త్రిషల పెళ్లి వార్తలు బాగా వినవచ్చాయి. అయితే వీరి పెళ్లి వ్యవహారంపైపై శింబు తండ్రి, ప్రముఖ నిర్మాత టి.రాజేందర్‌ను విలేకరులు స్పందించమని కోరారు. తాజాగా ఆయన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో విలేకరులు రాజేందర్‌ను శింబు-త్రిషల పెళ్లి వ్యవహారంపై స్పందించాలని కోరారు. అయితే ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు.
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విన్నైతండి వరువాయ’ (ఏం మాయ చేశావే) సినిమాలో శింబు, త్రిష జంటగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకుల్లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే తామిద్దరం స్నేహితులమేనని.. పెళ్లి వంటిదేం లేదని శింబు, త్రిష చెప్పారు.
శింబు, త్రిష గురించి అంతా కాస్త మరచిపోయారు. అయితే లాక్డౌన్ సమయంలో శింబు, త్రిషలు కలిసి ‘కార్తీక్ డయల్ సేతా యెన్’ అనే షార్ట్ ఫిలింలో నటించారు. ఈ తరుణంలో వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. అంతే కాకుండా ఈ ఏడాది డిసెంబర్లో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ప్రకటించాడు. ఇంకేముంది.. వీరిద్దరి పెళ్లి వార్తనే శింబు వెల్లడించబోతున్నాడంటూ ప్రచారం జోరందుకుంది. సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లిపై మరోసారి ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com