ఫ్యాన్సీ రేటుకి సైరా ఉత్త‌రాంధ్ర హ‌క్కులు

  • IndiaGlitz, [Wednesday,August 28 2019]

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న హిస్టారిక‌ల్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, నయ‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌వికిష‌న్‌, నిహారిక‌, త‌మ‌న్నా, నిహారిక‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులుగా న‌టించారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేసేలా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఆడియో వేడుక‌ను భారీ ఎత్తున నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుకకి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో పాటు.. కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ ముఖ్య అతిథులుగా విచ్చేయ‌నున్నారు.

హిస్టారిక‌ల్ మూవీ.. అందులో మెగాస్టార్, అమితాబ్‌, న‌య‌న‌తార‌, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, త‌మ‌న్నా వంటి స్టార్స్ న‌టించ‌డంతో సైరాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా హ‌క్కులను నిర్మాత‌లు భారీగా చెబుతున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ సైతం అంత మొత్తంలో హ‌క్కుల‌ను సొంతం చేసుకోవ‌డానికి వెనకాడ‌టం లేదు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఉత్త‌రాంధ్ర సైరా హ‌క్కుల‌ను కాంతి పిక్చ‌ర్స్ సంస్థ రూ14.40కోట్ల రూపాయ‌ల‌కు చేజిక్కించుకుంద‌ని స‌మాచారం. మ‌రి కీల‌క‌మైన నైజాం, సీడెడ్ ఏరియాల్లో సైరా ధ‌ర ఎంత ప‌ల‌క‌నుందోన‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. బ్రిటీష్ వారిని ఎదిరించి తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. ప్యాన్ ఇండియా సినిమాగా భారీ అంచ‌నాల‌తో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. రూ.250-300 కోట్ల వ్య‌యంతో అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాను నిర్మించారు.