విలేజ్ సెట్‌లో సైరా

  • IndiaGlitz, [Thursday,January 03 2019]

చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. బ్రిటీష్ వారికి ఎదురు తిరిగిన తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. రాంచ‌ర‌ణ్‌ నిర్మాత.

అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, త‌మన్నా, జగపతిబాబు, కిచ్చా సుదీప్ తది తరులు నటిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇటీవ‌ల ముంబైలో అండ‌ర్ వాట‌ర్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన సంగ‌తి తెలిసిందే.

కాగా.. ఇప్పుడు రామోజీ ఫిలింసిటీలో ఓ విలేజ్ సెట్‌ను వేశార‌ట‌. ఈ సెట్‌లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. ఇందులో చిరంజీవితో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌నతార‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి పాల్గొన‌బోతున్నారు. రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌లో తెర‌కెక్కిస్తున్నారు.

More News

పోసాని దర్శ‌క‌త్వం..

ర‌చ‌యిత‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దుప‌రి ద‌ర్శ‌కుడిగా మారారు. 'ఆప‌రేష‌న్ దుర్యోధ‌న' వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ త‌ర్వాత 'శ్రావ‌ణ మాసం' 

చ‌ర‌ణ్ భాడీ ఫిట్‌నెస్ వెనుక సీక్రెట్ ఇదే...

'విన‌య‌విధేయరామ' చిత్రంలో ఆరు ప‌ల‌క‌ల దేహంతో చ‌ర‌ణ్ చొక్కా విప్పి విల‌న్స్ భ‌ర‌తం ప‌డుతుంటే ఆడియెన్స్ ఆనందంగా విజిల్స్ వేశారు. అయితే ఆ లుక్ కోసం చ‌ర‌ణ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాడు

బాలీవుడ్‌లోకి మ‌రో విజ‌య్ దేవ‌రకొండ‌ చిత్రం...

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు పిచ్చ క్రేజ్ ఉంది. వ‌రుస సినిమాల‌తో స‌క్సెస్‌ఫుల్ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాడీ కుర్ర హీరో. విజ‌య్ దేవ‌ర‌కొండ గాలి ఏకంగా బాలీవుడ్ రేంజ్‌లో వీస్తుంది.

సింగ‌ర్‌ను పెళ్లి చేసుకోనున్న తేజ హీరోయిన్‌

హీరోయిన్స్ సోన‌మ్ క‌పూర్‌, దీపికా ప‌దుకొనే, ప్రియాంక చోప్రా.. ఇలా హీరోయిన్స్ అంద‌రూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. వీరి బాట‌లోనే పెళ్లి చేసుకోబోతుంది మ‌రో హీరోయిన్‌.

రోమియో ప్ర‌భాస్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా 20వ చిత్రం ..'జిల్' ఫేమ్ రాధాకృష్ణ‌కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్క‌నుంది.