డిసెంబర్‌లో సైరా రెగ్యులర్ చిత్రీకరణ
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణమే నటిస్తోంది.
అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డబుల్ ఆస్కార్ అవార్డుల విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుండి ప్రారంభం అవుతుందని అనుకున్నారు. కానీ మొదలు కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ డిసెంబర్‌కు పోస్ట్ పోన్ అయ్యింది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments