`సైరా నరసింహారెడ్డి` ట్రైలర్ 2: గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు
- IndiaGlitz, [Thursday,September 26 2019]
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నెల 18న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ గురువారం మరో ట్రైలర్‌ను విడుదల చేసింది. సినిమా విడుదలకు దగ్గరవుతున్న సందర్భంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచారు.
ఇండియాను ఈజీగా దోచుకోవచ్చు. ట్యాక్సులను 300 శాతం పెంచండి..బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ మన బంగారంతో తిరిగి రావాలి. అనే డైలాగ్‌తో పాటు అద్భుతమైన విజువల్స్‌ను ఈ ట్రైలర్‌లో మనం చూడొచ్చు. అలాగే ఆంగ్లేయులు.. మన భారతీయులను ఎలా హింసించారనే సన్నివేశాలను కూడా ఇందులో చూపించారు.
అది మనది.. మన ఆత్మ గౌరవం..గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు అంటూ చిరంజీవి చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్‌తో పాటు ఆయన చేసిన కొన్నియాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ డైలాగ్ నరసింహారెడ్డి భారతీయుల ఆత్మగౌరవాన్ని గురించి చెప్పే ఎమోషనల్‌గా చెప్పినట్లు కనపడుతుంది. ఇక యుద్ధ సన్నివేశాలను చూడొచ్చు.
చంపడమో, చావడమో ముఖ్యం కాదు.. గెలవడం ముఖ్యం అంటూ గోసాయి ఎంకన్న పాత్రలోని అమితాబ్, నరసింహారెడ్డి పాత్రధారిగా ఉన్న చిరుని ఇన్‌స్పైర్ చేసే డైలాగ్.. అలాగే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే..స్వాతంత్ర్యం.. స్వాతంత్ర్యం..స్వాతంత్ర్యం.. అంటూ ట్రైలర్ చివర్లో నరసింహారెడ్డి పాత్రధారిగా చిరంజీవి చెప్పిన డైలాగ్‌తో గూజ్‌బమ్స్ వస్తున్నాయి.
హై టెక్నికల్ వేల్యూస్, ఎమోషన్స్, యాక్షన్ పార్ట్ అన్నీ ఉండేలా ఈ సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.