సైరా.. ఆ వరుసలో చేరుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవికి సమ్మర్ సీజన్ బాగా కలిసొచ్చిన సీజన్. ఈ సీజన్‌లో ఆయన నటించిన పలు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇక.. యముడికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు చిత్రాలైతే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా.. ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అంతలా తనకు కలిసొచ్చిన వేసవికి.. తన తదుపరి చిత్రంతో పలకరించేందుకు చిరు సిద్ధమవుతున్నారా? అవుననే వినిపిస్తోంది టాలీవుడ్‌లో.
కాస్త వివరాల్లోకి వెళితే.. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహారెడ్డితో చిరు ప్రస్తుతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే.. ఆ సమయానికి ఈ సినిమా పూర్తయ్యే అవకాశం కనిపించకపోవడంతో.. వేసవి టార్గెట్‌గా విడుదల చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదికి వేసవికి రంగస్థలంతో పలకరించి హీరోగా బ్లాక్ బస్టర్ కొట్టిన చరణ్.. వచ్చే ఏడాది వేసవికి నిర్మాతగా బ్లాక్‌బస్టర్ హిట్ కొడతారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com