ఆగస్ట్ 22న 'సైరా' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా అభిమానులకు ఈ సారి చిరంజీవి పుట్టినరోజు నిజంగా పండుగ రోజు కానుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న `సైరా` టీజర్ ఆ రోజున విడుదల కానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై తండ్రి చిరంజీవి హీరోగా కొణిదెల రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా `సైరా`. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సురేఖ కొణిదెల సమర్పిస్తున్నారు.
ఈ సినిమా ఇటీవల ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. గురువారానికి హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయింది. 35 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో కీలక పాత్రధారులు పాల్గొన్నారు. తక్కువ లైటింగ్‌తో , వర్షంలో సీక్వెన్స్ ని తెరకెక్కించారు. ఆంగ్లేయులకు ఎదురుతిరిగిన తొలి పాలెగాడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విజయ్ సేతుపతి, రవికిషన్, సుదీప్, తమన్నా, నీహారిక కొణిదెల తదితరులు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments