ఆగ‌స్ట్ 22న 'సైరా' టీజ‌ర్‌

  • IndiaGlitz, [Friday,July 27 2018]

మెగా అభిమానుల‌కు ఈ సారి చిరంజీవి పుట్టిన‌రోజు నిజంగా పండుగ రోజు కానుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'సైరా' టీజ‌ర్ ఆ రోజున విడుద‌ల కానుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై తండ్రి చిరంజీవి హీరోగా కొణిదెల రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న సినిమా 'సైరా'. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేఖ కొణిదెల స‌మ‌ర్పిస్తున్నారు.

ఈ సినిమా ఇటీవ‌ల ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. గురువారానికి హైద‌రాబాద్ షెడ్యూల్ పూర్త‌యింది. 35 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్లో కీల‌క పాత్ర‌ధారులు పాల్గొన్నారు. త‌క్కువ లైటింగ్‌తో , వ‌ర్షంలో సీక్వెన్స్ ని తెర‌కెక్కించారు. ఆంగ్లేయుల‌కు ఎదురుతిరిగిన తొలి పాలెగాడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విజ‌య్ సేతుప‌తి, ర‌వికిష‌న్‌, సుదీప్‌, త‌మ‌న్నా, నీహారిక కొణిదెల త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

More News

గుడాచారి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలి - నాని

'క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గుడాచారి'.శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

వెండితెరకు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ 'విశ్వదర్శనం'

దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె. విశ్వనాథ్‌ జీవితం వెండితెరపైకి రానుంది. 'విశ్వదర్శనం' పేరుతో రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగాయి.

ఆగస్ట్‌ 10న కమల్‌హాసన్‌ 'విశ్వరూపం 2'

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన 'విశ్వరూపం' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

'పేపర్ బాయ్' టీజర్ కి అద్భుతమైన స్పందన

సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్ , రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'..

విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం బ‌న్ని...

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల‌తో హీరోగా ఇమేజ్ సంపాదించుకున్న క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర కొండ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'గీత గోవిందం'.