ఏకధాటిగా 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
బాక్సాఫీస్‌కు కొత్త లెక్కలు నేర్పించిన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. 10 ఏళ్ళ విరామం తరువాత 'ఖైదీ నంబర్ 150'తో పలకరించినా.. రికార్డు స్థాయి వసూళ్ళను తన సొంతం చేసుకున్నారాయన. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చిరు తన 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్‌బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ గురువారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 40 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ కొనసాగనుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో పోరాట సన్నివేశాలతో పాటు, కొంత టాకీ పార్ట్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. అలాగే.. ఆగస్టు 22న చిరు బర్త్ డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయబోతున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com