శరవేగంగా సైరా
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం `సైరా నరసింహారెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి 30 శాతంకి పైగా చిత్రీకరణ పూర్తయ్యింది. హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ సినిమాకు సంబంధించిన 40 రోజుల భారీ షెడ్యూల్ ఇప్పుడు జరుగుతోంది. స్పెయిన్‌కు చెందిన హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌ల ఆధ్వర్యంలో కథకు కీలకమైన పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. దీని కోసం రాత్రి, పగలు తేడా లేకుండా చిరుతో సహా ఇతర ప్రధాన తారాగణం ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. డిసెంబర్ నాటికి టాకీ పార్ట్ పూర్తిచేసి.. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌పై దృష్టి పెట్టనుంది చిత్ర బృందం. వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదల అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments