సైరా ఆగమనం ఎప్పుడంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఖైదీ నెం.150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. తన కెరీర్లో 150వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాతో.. సంచలన విజయం అందుకున్నారు చిరు. ప్రస్తుతం తన 151వ చిత్రంగా సైరా నరసింహారెడ్డి రూపొందుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై చిరు తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.. చిరు కెరీర్లో ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచిన జగదేకవీరుడు - అతిలోక సుందరి (1990), గ్యాంగ్ లీడర్ (1991) చిత్రాల విడుదల తేదీ అయిన మే 9ని పురస్కరించుకుని.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments