సైరా ఆగ‌మ‌నం ఎప్పుడంటే..

  • IndiaGlitz, [Thursday,May 10 2018]

ఖైదీ నెం.150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. త‌న కెరీర్‌లో 150వ సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమాతో.. సంచ‌ల‌న విజ‌యం అందుకున్నారు చిరు. ప్ర‌స్తుతం త‌న 151వ చిత్రంగా సైరా న‌ర‌సింహారెడ్డి రూపొందుతోంది. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై చిరు త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.

న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి, సుదీప్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే.. చిరు కెరీర్‌లో ఇండ‌స్ట్రీ హిట్స్‌గా నిలిచిన జ‌గ‌దేక‌వీరుడు - అతిలోక సుంద‌రి (1990),  గ్యాంగ్ లీడ‌ర్ (1991) చిత్రాల విడుద‌ల తేదీ అయిన మే 9ని పుర‌స్క‌రించుకుని.. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.

More News

చైత‌న్య సంద‌డి అప్పుడే!

గ‌తేడాది వేస‌వికి రారండోయ్ వేడుక చూద్దాం అంటూ ఓ మంచి విజ‌యాన్ని అందుకున్నారు యువ‌క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌. ఆ త‌రువాత చేసిన యుద్ధం శ‌ర‌ణం నిరాశ‌ప‌రిచింది.

'మెహ‌బూబా' నిడివి ఎంతంటే..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం మెహ‌బూబా. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ పున‌ర్జ‌న్మ‌ల  ప్రేమ‌క‌థా చిత్రం ద్వారా పూరీ త‌న‌యుడు పూరీ ఆకాష్

ఆకాశ్ పూరి బిగ్ స్టార్‌గా ఎద‌గాలి - ప్ర‌భాస్‌

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య

పూరీ బాట‌లో వంశీ కూడా వెళ‌తారా?

పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శ్రీనువైట్ల, సుకుమార్ ఈ నలుగురు దర్శకులకి సంబంధించి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది.

కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో చిరు?

మిర్చి చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ర‌చ‌యిత కొర‌టాల శివ‌.. తొలి ప్ర‌యత్నంలోనే విజ‌యం అందుకున్నారు.