రంగస్థలం విడుదల తేదిన సైరా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని వేసవిలో విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం.. రంగస్థలం విడుదల తేదినే అంటే మార్చి 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది.
నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవికిషన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments