'సైరా నరసింహారెడ్డి'..సమస్య అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. అయితే దర్శకుడి పని తీరుతో చిరు సంతృప్తి చెందలేదని...త్వరలో జరిగే రెండవ షెడ్యూల్ కోసం సురేందర్ రెడ్డి స్థానంలో గుణశేఖర్‌ని రంగంలోకి దింపాలని చిరు ఆలోచిస్తున్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
దానికి తోడు చిరు ఈ సినిమా కోసం పెంచిన గెడ్డం తీసివేయడంతో.. ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఇదిలా ఉంటే..తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక రూమర్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. బడ్జెట్ సమస్య తలెత్తిన కారణంగా ఈ సినిమా చిత్రీకరణలో జాప్యం అవుతోందని వినిపిస్తోంది.
కాని చిరు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం...ఈ మూవీ నిర్మాత రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమా ఆఖరి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని.. ఆపై 'సైరా'కి పూర్తిగా అందుబాటులో ఉండడం కోసమే కొంత గ్యాప్ ఇచ్చారని వెల్లడిస్తున్నారు. అంతే గాక 'రంగస్థలం', 'సైరా' సినిమాలకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా ఉండడం కూడా ఒక కారణమని తెలియజేస్తున్నారు. మరి ఈ విషయాల్లో ఏది నిజమో తెలియాలంటే కొంత కాలం వేచి ఉండాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com