సైరా!..జార్జియా షెడ్యూల్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలవుతుంది. ఇటీవల జార్జియా వెళ్లిన యూనిట్ అక్కడ క్లైమాక్స్ చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు.
ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు. అమితాబ్ బచ్చన్,నయనతార, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ తదితరులు కీలక పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com