‘సైరా నరసింహారెడ్డి’ అప్‌డేట్‌

  • IndiaGlitz, [Friday,March 16 2018]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చ‌న్‌, న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. డిసెంబ‌ర్‌లోనే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది.

ఈ షెడ్యూల్‌లో భాగంగా.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నార‌ని తెలిసింది. అలాగే ఈ నెల 23 నుంచి అమితాబ్ బచ్చన్, నయనతార కూడా ఈ షూటింగ్‌లో పాల్గొనబోతున్నార‌ని స‌మాచారం.  పరుచూరి బ్రదర్స్, సాయి మాధవ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు ఛాయాగ్రాహ‌ణం అందిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా 2019లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.