'సైరా నరసింహారెడ్డి' కొత్త షెడ్యూల్ అప్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం....తొలి షెడ్యూల్ గత డిసెంబర్ నెలలో పూర్తయిన విషయం తెలిసిందే. ఇక రెండో షెడ్యూల్ ను ఈ నెల 23 నుంచి ప్రారంభించడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ లో చిరు, నయనతారల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.
ఈ సన్నివేశాలు చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ భాగానికి సంబంధించినవని తెలిసింది. మార్చి నెలాఖరు వరకు జరగబోయే ఈ షెడ్యూల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా పాల్గొంటారన్నది విశ్వసనీయ వర్గాల ఇన్‌ఫర్‌మేషన్. అంతేగాకుండా....సంగీతదర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్ స్థానంలో ఇళయరాజాను తీసుకోనున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని...కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com