'సైరా నరసింహారెడ్డి' కొత్త షెడ్యూల్ అప్ డేట్

  • IndiaGlitz, [Thursday,February 15 2018]

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం....తొలి షెడ్యూల్ గత డిసెంబర్ నెలలో పూర్త‌యిన విష‌యం తెలిసిందే. ఇక రెండో షెడ్యూల్ ను ఈ నెల 23 నుంచి ప్రారంభించడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ లో చిరు, నయనతారల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని స‌మాచారం.

ఈ సన్నివేశాలు చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ భాగానికి సంబంధించినవని తెలిసింది. మార్చి నెలాఖరు వరకు జరగబోయే ఈ షెడ్యూల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా పాల్గొంటారన్న‌ది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ఇన్‌ఫ‌ర్‌మేష‌న్‌. అంతేగాకుండా....సంగీతదర్శకుడిగా ఎ.ఆర్.రెహమాన్ స్థానంలో ఇళయరాజాను తీసుకోనున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని...కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

More News

'కొత్తగా ఉన్నాడు' ఆడియో వేడుక

తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అందాల కథానాయకుడు ఆకాష్ తాజాగా తెలుగులో నటించిన చిత్రం `కొత్తగా ఉన్నాడు'.

సైకలాజికల్ లవ్ స్టోరీగా మసక్కలి

కొన్ని కథలు విని నమ్ముతాం..కొన్ని కథలు చూసి నమ్ముతాం..మరికొన్ని కథలు చూసినా నమ్మలేని విధంగా ఉంటాయి..

'47 డేస్' ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేసిన పూరి

ప్రదీప్ మద్దాలిని దర్శకుడిగా పరిచయం చేస్తూ టైటిల్ కార్డ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న సినిమా '47 డేస్'..  "ది మిస్టరీ అన్ ఫోల్డ్స్" అనేది ట్యాగ్ లైన్..సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ నుండి "క్యా కరూన్" అని సాగే మొదటి పాటను వాలెంటైన్స్ డే సందర్భంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు..రఘు కుంచె స్వరపరచి

'తొలి ప్రేమ‌' స‌క్సెస్ మీట్‌

బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన సినిమా 'తొలి ప్రేమ‌'. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ప్ర‌సాద్ నిర్మాత‌. ఈ సినిమా థాంక్స్ మీట్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది.

నాలుగోవారం కూడా కొన‌సాగేనా?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఈ ఏడాది సంక్రాంతి సీజ‌న్ పెద్ద‌గా అచ్చి రాక‌పోయినా.. జ‌న‌వ‌రి చివ‌రి వారం నుంచి బాగానే క‌లిసొస్తోంది. మ‌రీ ముఖ్యంగా.. వారానికో సినిమా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుండ‌డం విశేషం. జ‌న‌వ‌రి 26న అనుష్క న‌టించిన భాగ‌మ‌తి చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది.