మార్చి 5 నుంచి 'సైరా నరసింహారెడ్డి' షెడ్యూల్?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి`. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా వుంటే.. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఈ నెలలోనే రెండో షెడ్యూల్ జరుపుకోవాల్సి ఉంది.
అయితే.. ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రస్తుతం రంగస్థలం` రీ-షూట్ పనుల్లో బిజీగా ఉండడంతో షెడ్యూల్ కాస్త వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం.. మార్చి 5 నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, నయనతార, అమితాబ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాగా, సంగీత దర్శకుడు రెహమాన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. ఆయన స్థానంలో ఇళయరాజాను తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com