సెన్సార్ పూర్తి చేసుకున్న `సైరా నరసింహారెడ్డి`
Send us your feedback to audioarticles@vaarta.com
ఎప్పుడెప్పుడా అని ఆతృతగా మెగాభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం `సైరా నరసింహారెడ్డి`. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. దీంతో సినిమా అక్టోబర్ 2న విడుదల కావడానికి అన్నీ దారులు క్లియర్ అయ్యాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాతగా ఈ సినిమా నిర్మితమవుతోంది. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, నిహారిక, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రధారులుగా నటించారు.
భారీ అంచనాలను తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌ల సైరా సెన్సేషన్‌కు తెర తీసింది. వివరాల ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ రూ.40 కోట్లు చెల్లించి దక్కించుకుందని టాక్. అలాగే సినిమా అన్ని భాషలకు కలిపి రూ.125 కోట్లమేరకు చెల్లించి జీ నెట్వర్క్ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments