సెన్సార్ పూర్తి చేసుకున్న `సైరా న‌ర‌సింహారెడ్డి`

  • IndiaGlitz, [Monday,September 23 2019]

ఎప్పుడెప్పుడా అని ఆతృత‌గా మెగాభిమానులు ఎదురుచూస్తున్న చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. దీంతో సినిమా అక్టోబ‌ర్ 2న విడుద‌ల కావ‌డానికి అన్నీ దారులు క్లియ‌ర్ అయ్యాయి. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, నయ‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌వికిష‌న్‌, నిహారిక‌, త‌మ‌న్నా, నిహారిక‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులుగా న‌టించారు.

భారీ అంచ‌నాల‌ను తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.110 కోట్ల రూపాయ‌ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని స‌మాచారం. ఇప్పుడు డిజిట‌ల్ మార్కెటింగ్‌ల సైరా సెన్సేష‌న్‌కు తెర తీసింది. వివ‌రాల ప్ర‌కారం ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థ రూ.40 కోట్లు చెల్లించి ద‌క్కించుకుంద‌ని టాక్‌. అలాగే సినిమా అన్ని భాష‌ల‌కు క‌లిపి రూ.125 కోట్లమేర‌కు చెల్లించి జీ నెట్‌వ‌ర్క్ శాటిలైట్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది.

More News

కుప్పకూలిన ‘థామస్‌కుక్‌’.. నో చెప్పిన బ్రిటన్ సర్కార్!

బ్రిటిష్‌ పర్యాటక సంస్థ ‘థామస్‌కుక్‌’ ఒక్కసారిగా కుప్పకూలింది. పది, పదిహేను కాదు.. ఏకంగా 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కంపెనీ దివాలా ప్రకటించడం పెద్ద షాకింగ్ న్యూసే.

మగబిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్

అందాల తార అమీ జాక్సన్.. పెళ్లి కాకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

మౌనిక ఫ్యామిలీకి రూ. 20 లక్షలు.. ఒకరికి ఉద్యోగం!

హైదరాబాద్‌లో మెట్రో పిల్లర్ పెచ్చులూడిపడి మౌనిక అనే మహిళ చనిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

రసూల్ పురా ‘మెట్రో’ పైకప్పు పెచ్చులూడిందా!

హైదరాబాద్‌లోని అమీర్ పేట మెట్రో రైల్వేస్టేషన్ ఆవరణలో పైకప్పు పెచ్చులూడిన ఘటనలో మౌనిక అనే మహిళ మృతి చెందిన అనంతరం అన్నీ అనుమానాలే వెల్లువెత్తుతున్నాయి.

జనాభా లెక్కలకోసం ఇక మొబైల్ యాప్!

అవును.. జనాభా లెక్కల కోసం ఇన్ని రోజులూ ఇంటింటికి వచ్చి లెక్కలేసుకుని మరీ రాసుకోవాల్సి వచ్చేది.