‘సైరా’ మేకింగ్ వీడియో వచ్చేసిందహో...!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ అభిమానులు ఎంతగా వేచి చూస్తున్న ‘సైరా’ మేకింగ్ వీడియో వచ్చేసింది. సినిమా మొదలెట్టిన నాటి నుంచి నేటి వరకు సైరాకు సంబంధించి అప్డేట్స్ కోసం చిరు అభిమానులు వేయికళ్లతో వేచి చూస్తూ వచ్చారు. అనుకున్నట్లుగానే సైరా నరసింహారెడ్డి మేకింగ్ వీడియోను ఆగస్ట్ 15 ఒక్కరోజు ముందు.. 14వ తేదీ సాయంత్రం 3.45 నిమిషాలకు సైరా మేకింగ్ వీడియో విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో చూసిన మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు.
కాగా 1:47 నిమిషాలు గల ఈ వీడియోలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కి సంబంధించిన స్టార్స్ సైరా చిత్రంలో కనువిందు చేశారు. ముఖ్యంగా చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా, రవికిషణ్ నిహారిక తదితర పాత్రల్ని ఈ మేకింగ్ వీడియోలో అలరిస్తున్నారు. అంతేకాదు నిహారిక, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇందులో కనిపించారు. హై టెక్నాలజీ వాల్యూస్‌తో, ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో అద్భుత దృశ్య కావ్యంగా ఈ చిత్రాన్ని దర్శక నిర్మాతలు చెక్కారు.
హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ టీంతో సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా ఈ చిత్ర టీజర్ ఆగస్ట్ 20న అధికారికంగా విడుదల కానుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వీడియోతో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ‘సైరా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 ప్రేక్షకుల సినీ ప్రియులు, మెగాభిమానుల ముందుకు వచ్చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments