సైరా తొలిరోజు కలెక్షన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతరా, తమన్నా, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ స్టార్ కాస్టింగ్‌తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలిరోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్‌ను రాబట్టుకుంది. తొలిరోజున రూ.38.60కోట్ల వసూళ్లను సినిమా సాధించింది. నైజాంలో 8.10 కోట్లు, సీడెడ్‌లో 5.91 కోట్లు, ఉత్తరాంధ్రలో 4.63కోట్లు, గుంటూరు 5.06 కోట్లు, ఈస్ట్ 5.30 కోట్లు, వెస్ట్ 4.50 కోట్లు, కృష్ణా 3.03 కోట్లు, నెల్లూరు 2.09 కోట్ల రూపాయలు.. మొత్తంగా 38.60 కోట్ల రూపాయల వసూళ్లను సినిమా సాధించింది. అలాగే ఓవర్‌సీన్‌లో 1 మిలియన్ డాలర్స్‌ను రాబట్టుకుంది.
బ్రిటీష్ వారిని ఎదిరించిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు మూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో సినిమా తెరకెక్కింది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తనయుడు రామ్‌చరణ్ అన్ కాంప్రమైజ్డ్గా తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్‌ను గట్టిగానే రాబట్టుకుంది. మరి ఇతర రాష్ట్రాల్లో ఏ మేర కలెక్షన్స్ ఉంటాయో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com