బాహుబలిని దాటేసిన సైరా
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ హీరోల సినిమాలంటే ఎన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో అని సినీ వర్గాలు.. అందరి హీరోలను తమ హీరో దాటి రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తుంటారు. పోటీతత్వం ఉంటేనే మంచి ఔట్పుట్ ఉంటుంది.
ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో బాహుబలి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈసినిమాను మరో స్టార్ హీరో సినిమాలేవీ క్రాస్ చేయడం లేదు. అంతెందుకు బాహుబలిలో హీరోగా నటించిన ప్రభాస్.. తన సాహోచిత్రంతోనూ ఆ రికార్డులను అందుకోలేకపోయాడు.
ఇప్పుడు అందరి దృష్టి సైరా నరసింహారెడ్డిపైన ఉంది. మెగాస్టార్ చిరంజీవి సహా అమితాబ్, నయనతార, విజయ్‌సేతుపతి, కిచ్చాసుదీప్, తమన్నా, అనుష్క ఇలా భారీ తారాగణంతో ప్యాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదలవుతుంది. అయితే కలెక్షన్స్ విషయం ఏమో ఇప్పుడే చెప్పలేం కానీ.. ఓ విషయంలో సైరా అప్పుడే బాహుబలిని క్రాస్ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలియజేశాడు. అదేందులో అంటారా? వి.ఎఫ్.ఎక్స్ షాట్స్‌లో బాహుబలికి 2300 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉంటే.. సైరాలో 3800 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్‌ను ఉపయోగించారట. బాహుబలికి వి.ఎఫ్.ఎక్స్ పర్యవేక్షించిన కమల్ కణ్ణనే ఈ సినిమాకు కూడా వి.ఎఫ్.ఎక్స్ అందించాడట.
ఏదేమైనా ఇంత గ్రాండ్స్కేల్లో మరో తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమా రానుండటం మనం గర్వపడాల్సిన విషయమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout