'సైరా' కాస్ట్ లీ సెట్ లేరా
Send us your feedback to audioarticles@vaarta.com
తొలిగా స్వాతంత్ర్యాన్ని కాంక్షించిన ఉద్యమ వీరుడు, రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పౌరుష గాథను అంతే పగడ్బంధీగా, అంతకన్నగా ప్రతిష్టాత్మకంగా రామ్‌చరణ్ తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై ఆయన నిర్మిస్తున్న సినిమా ఇది. తన తండ్రి కెరీర్లోనే ది బెస్ట్ సినిమాగా నిలవాలని చరణ్ ఎయిమ్ చేస్తున్నాడు.
తాజాగా అందుకే ఎక్కడా ఈ సినిమా బడ్జెట్ విషయంలో రామ్‌చరణ్ వెనకడుగు వేయడం లేదు. దర్శకుడు సురేందర్‌రెడ్డి అడిగింది అడిగినట్టు సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని ఇటీవల సుదీప్ అభివర్ణఙంచారు. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ అమితాబ్ నుంచి కన్నడ సుదీప్, తమిళ విజయ్ సేతుపతి... ఇలా పలువురు భాషా ప్రముఖులున్నారు.
ప్రతి మైన్యూట్ విషయాన్ని ఒకటికి వంద సార్లు ఆలోచించి, డిజైన్ చేసి తెరకెక్కిస్తున్నారు. తాజాగా నరసింహారెడ్డి జీవితంతో ముడిపడి ఉన్న బీదర్ కోటను రూపొందిస్తున్నారు. ఆనాడు అత్యంత వైభవంగా విలసిల్లిన ఈ కోటను పునఃప్రతిష్టించి అక్కడ వారం రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. నయనతార, తమన్నా, నీహారిక కొణిదెల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout