'సైరా' కన్నా వెనకబడ్డ 'వార్'
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ గాంధీ జయంతి రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా నరసింహారెడ్డి` విడుదలైంది. తెలుగు సహా దక్షిణాది రాష్ట్రాల్లో చిరంజీవికి పోటీ లేకపోయినా.. ఉత్తరాదిన మాత్రం సైరా నరసింహారెడ్డికి పోటీగా `వార్` సినిమా విడుదలైంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోలు నటించడంతో సైరాకు బాలీవుడ్లో ఈ సినిమాతో పోటీ తప్పదని అనుకున్నారు. కానీ.. సినీ వర్గాల సమాచారం ప్రకారం బాలీవుడ్‌లోనూ సైరాకి మంచి ఆదరణ దక్కుతుంది. దక్షిణాది మీడియాతో బాలీవుడ్ సినీ వర్గాలు కూడా `సైరా నరసింహారెడ్డి` బావుందంటూ ప్రశంసలు కురిపించాయి. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
అలాగే బాలీవుడ్లో మంచి బ్రేక్ సాధిస్తుందని అందరూ భావించిన వార్ సినిమాకు సైరా బ్రేకులేశాడట. ఈ సినిమాను పరావాలేదనేలానే అందరూ అంటున్నారు. రివ్యూలు కూడా యావరేజ్ అంటూనే రావడం ఈ సినిమాకు శరాఘాతంలా మారింది. వార్ సినిమాను నిర్మాతలు భారీ స్థాయిలో విడుదల చేశారు. హృతిక్, టైగర్ ష్రాఫ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇండియన్ అన్ సంగ్ ఫ్రీడమ్ వారియర్ సైరా నరసింహారెడ్డి తన ప్రత్యేకతను చాటుకుంది. మేకింగ్ వేల్యూస్, ప్రొడక్షన్ వేల్యూస్ .. చిరు యాక్టింగ్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. మరి సైరా ఎలాంటి కలెక్షన్స్‌ను రాబట్టుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout