'సైరా' క‌న్నా వెన‌క‌బ‌డ్డ 'వార్‌'

  • IndiaGlitz, [Thursday,October 03 2019]

ఈ గాంధీ జ‌యంతి రోజున మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'సైరా న‌ర‌సింహారెడ్డి' విడుద‌లైంది. తెలుగు స‌హా ద‌క్షిణాది రాష్ట్రాల్లో చిరంజీవికి పోటీ లేక‌పోయినా.. ఉత్త‌రాదిన మాత్రం సైరా న‌ర‌సింహారెడ్డికి పోటీగా 'వార్' సినిమా విడుద‌లైంది. హృతిక్ రోష‌న్, టైగ‌ర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోలు న‌టించ‌డంతో సైరాకు బాలీవుడ్‌లో ఈ సినిమాతో పోటీ త‌ప్ప‌ద‌ని అనుకున్నారు. కానీ.. సినీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం బాలీవుడ్‌లోనూ సైరాకి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ద‌క్షిణాది మీడియాతో బాలీవుడ్ సినీ వ‌ర్గాలు కూడా 'సైరా న‌ర‌సింహారెడ్డి' బావుందంటూ ప్ర‌శంస‌లు కురిపించాయి. పాజిటివ్ రివ్యూలు వ‌చ్చాయి.

అలాగే బాలీవుడ్‌లో మంచి బ్రేక్ సాధిస్తుంద‌ని అంద‌రూ భావించిన వార్ సినిమాకు సైరా బ్రేకులేశాడ‌ట‌. ఈ సినిమాను ప‌రావాలేద‌నేలానే అంద‌రూ అంటున్నారు. రివ్యూలు కూడా యావ‌రేజ్ అంటూనే రావ‌డం ఈ సినిమాకు శ‌రాఘాతంలా మారింది. వార్ సినిమాను నిర్మాత‌లు భారీ స్థాయిలో విడుద‌ల చేశారు. హృతిక్‌, టైగ‌ర్ ష్రాఫ్‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఇండియ‌న్ అన్ సంగ్ ఫ్రీడమ్ వారియ‌ర్ సైరా న‌ర‌సింహారెడ్డి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. మేకింగ్ వేల్యూస్‌, ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ .. చిరు యాక్టింగ్ సినిమాను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లాయి. మ‌రి సైరా ఎలాంటి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంటుందో చూడాలి.

More News

‘మీకు మాత్రమేచెప్తా’ నవంబర్1న రిలీజ్

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తీసిన తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’ రిలీజ్ కు రెడీ అయింది..

గోపీచంద్‌-తమన్నాచిత్రం ప్రారంభం

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ (ప్రొడక్షన్‌ నెం. 3)

దిల్ రాజు చేతుల మీదుగా ‘అది ఒక ఇదిలే’ ట్రైలర్ రిలీజ్

850 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన సీనియర్ మోస్ట్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ దర్శకురాలిగా మారారు.

ఆ పాత్ర‌కు చిరు ప్రాణం పోశారు: రాజ‌మౌళి

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితగాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`.

'శ్రీవిష్ణు' హీరోగా 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,అభిషేక్ అగర్వాల్  ఆర్ట్స్' చిత్రం

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి.