ఫలిస్తున్న జగన్ ప్రయత్నాలు.. కడపకు భారీ ప్రాజెక్ట్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వైఎస్ జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు గత ప్రభుత్వం దెబ్బిపొడుస్తుంటే.. మరోవైపు కష్టాల్లో రాష్ట్రం ఉండటంతో గట్టెక్కాలంటే పెట్టుబడులు ఆహ్వానించి.. భారీగానే ఏపీకి రప్పించాలని సర్కార్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో జగన్ చేస్తున్న చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టే అని తాజా పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తోంది. ఏపీలో భారీ పెట్టుబడి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. జగన్ ఇలాఖా, కడప జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ స్థాపించేందుకు ఓ స్విస్ కంపెనీ ముందుకు రావడమే ఇందుకు చక్కటి ఉదాహరణ.
భారీ ప్రాజెక్ట్!
వైయస్సార్ జిల్లాలో ఇప్పటికే బ్రాహ్మణి స్టీల్ ఫ్లాంట్‌కు జగన్ ఇదివరకే భూమి పూజ చేసిన విషయం విదితమే. అయితే.. ఇదే జిల్లాలో మరో భారీ స్టీల్‌ప్లాంట్ పెడతామంటూ ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంపెనీ ప్రతినిధులు జగన్ ఎదుట వైయస్సార్ జిల్లాలో ప్లాంట్ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఈ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఆర్ కంపెనీ కార్యకలాపాలను సీఎం అడిగితెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నడుతున్నామంటూ వారు వివరించారు.
అన్ని విధాలా సేఫ్!
వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామంటూ వారికి వివరించారు. ఐఎంఆర్ కూడా మరొక స్టీల్‌ప్లాంట్ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడ నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని సీఎం వారికి వివరించారు. పరిశ్రమల రాకవల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందంన్నారు. రానున్నరోజుల్లో వైయస్సార్ జిల్లా ప్రాంతం స్టీల్‌సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments