విడాకుల‌పై స్పందించిన శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌

  • IndiaGlitz, [Wednesday,January 22 2020]

తెలుగులో కొత్త బంగారు లోకంలో హీరోయిన్‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బెంగాళీ బ్యూటీ శ్వేతా బ‌సు ప్ర‌సాద్‌. ఈ అమ్మ‌డు త‌ర్వాత తెలుగులో కొన్ని చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది. కానీ.. స్టార్ హీరోయిన్‌గా మాత్రం పేరు ద‌క్కించుకోలేదు. అనుకోకుండా వివాదాల‌కు కేంద్ర బిందువుగా కూడా మారింది. అయితే తెలుగు నుండి బాలీవుడ్‌కి మ‌కాం మార్చిన శ్వేతాబ‌సుకి అక్క‌డ కూడా సినిమాలు చేసింది. ఆ స‌మ‌యంలో రోహిత్ మిట్ట‌ల్ అనే ఫిలిం మేక‌ర్‌తో ఐదేళ్ల పాటు రిలేష‌న్ చేసి త‌ర్వాత పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి మున్నాళ్ల ముచ్చ‌ట‌గానే మిగిలిపోయింది. 2018లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. 2019 చివ‌ర‌లో విడిపోయారు.

త‌న విడాకుల విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసిన శ్వేతాబ‌సు.. రీసెంట్‌గా డైరెక్ట్‌గా విడాకుల విష‌యంపై స్పందించింది. ''నేను, రోహిత్ మిట్ట‌ల్ ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడిపోయాం. ఇద్ద‌రం స్నేహితుల్లాగానే విడిపోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. ప్ర‌స్తుతం విడాకుల కోసం కోర్టును సంప్ర‌దించి ఉన్నాం. రోహిత్ ప్రొఫెష‌న‌ల్‌గా చాలా బావుంటాడు. త‌న‌తో చేసిన ఐదేళ్ల ప్ర‌యాణంలో ఎన్నో సంతోషాల‌ను పంచుకున్నాం. ప్ర‌స్తుతం నా కెరీర్‌పైనే దృష్టి పెట్టి ఉన్నాను. ప్రేమ‌లో ప‌డ‌న‌ని చెప్ప‌ను కానీ.. ప్ర‌స్తుతానికి ఆ ఆలోచ‌న లేదు'' అంటూ సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా శ్వేతాబ‌సు ప్ర‌సాద్ స్పందించింది.