పూర్ణోదయా వారి ఆణిముత్యం - స్వాతిముత్యం కు ముప్పై ఏళ్ళు

  • IndiaGlitz, [Saturday,March 12 2016]

క‌మ‌ల్ హాస‌న్ - కె.విశ్వ‌నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన ఆణిముత్యం - స్వాతిముత్యం. పూర్ణోద‌య మూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉత్త‌మాభిరుచి గ‌ల నిర్మాత ఏడిద నాగేశ్వ‌ర‌రావు ఈ చిత్రాన్నినిర్మించారు.ఆస్కార్ అవార్డ్స్ కి ఉత్త‌మ విదేశీ చిత్రం విభాగంలో ప‌రిశీలించిన తెలుగు చిత్రం స్వాతిముత్యం కావ‌డం విశేషం. తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ మ‌రువ‌లేని చిత్రంగా నిలిచిన స్వాతిముత్యం 1986లో మార్చి 13న రిలీజ్ అయ్యింది. అంటే స‌రిగ్గా 30 ఏళ్లు పూర్త‌య్యాయి.

ఈ సంచ‌ల‌న‌ చిత్రం రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ తో అవార్డుల‌ను కూడా సొంతం చేసుకుంది. జాతీయ అవార్డ్స్ లో ఉత్త‌మ తెలుగు చిత్రం, నంది అవార్డ్స్ లో బంగారు నంది, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డ్స్ తో పాటు ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా గెలుచుకుంది. తెలుగులోనే కాకుండా ర‌ష్య‌న్ భాష‌లో కూడా డ‌బ్ చేయ‌డం...అక్క‌డ కూడా ఘ‌న విజ‌యం సాధించ‌డం విశేషం. త‌మిళ్ లో సిప్పిక్కుల్ ముత్తుగా విజ‌య ఢంకా మ్రెగించింది. తెలుగులో 25 కేంద్రాల్లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది. క‌ర్ణాట‌క‌లో 500 రోజుల‌కు పైగా ఆడింది.

కమలహాసన్ , రాధిక , శరత్ బాబు , గొల్లపూడి ,సుత్తి వీరబద్ర రావు , మల్లికార్జున రావు , ఏడిద శ్రీరామ్ , దీప , వై . విజయ మాస్టర్ కార్తిక్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాటలు : సాయినాథ్ & ఆకెళ్ళ పాటలు : Dr సి. నారాయణ రెడ్డి , ఆత్రేయ & సీతారామ శాస్త్రి ఫోటోగ్రఫీ : మవ్. రఘు గానం : spb , s.జానకి , p .సుశీల & sp. శైలజ సంగీతం : ఇళయరాజా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : ఏడిద రాజా నిర్మాత : ఏడిద నాగేశ్వరరావు కథ , స్క్రీన్ ప్లే - దర్శ‌కత్వం : కె.విశ్వనాధ్