తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలోకి స్వాతి సినిమా
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతి, నవీన్‌చంద్ర హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'త్రిపుర'. ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా బ్యానర్‌పై రాజ కిరణ్ దర్శత్వంలో ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్‌లు నిర్మించారు. ఈ సినిమా టీజర్ విడుదలైంది. వెలిగొండ శ్రీనివాస్, రాజాలు కథనంను బాగా రావడానికి బాగా సపోర్ట్ చేశారు. స్వాతి, నవీన్ లు తమ నటనతో సినిమాకి ప్రాణం పోశారు. కామ్రాన్ రీరికార్డింగ్ హైలైట్ గా నిలుస్తుంది. గీతాంజలి కంటే మంచి మూవీ ఈ త్రిపుర అని దర్శకుడు రాజకిరణ్ అన్నారు.
విలేజ్ అమ్మాయి పాత్రలో నటించాను. దర్శకుడు సినిమాలో మా పాత్రలను చక్కగా ఎలివేట్ చేశారని స్వాతి అన్నారు. ఇందులో డాక్టర్ రోల్ చేశాను. ఈ సినిమాలో కథే హీరో ఎగ్జయిటింగ్ స్కిప్ట్ తో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది అని నవీన్ చంద్ర అన్నారు. దర్శకుడు రాజ కిరణ్ గారు కథ చెప్పిన దాని కంటే సినిమాన బాగా తీశారని కోనవెంకట్ సినిమాని గాడ్ ఫాదర్ లా నిలబడ్డారు. రాజశేఖర్, రామాంజనేయులు సినిమాకి అండగా నిలబడ్డారని నిర్మాత ఎ.చినబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రబోస్, రాజా, ఆర్ట్ డైరెక్టర్ రామకుమార్ తదితరులు పాల్గొన్నారు. రావు రమేష్, తిలక్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, పూజ, శివన్నారాయణ, ధనరాజ్, షకలక శంకర్, రజిత, సుధాకర్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, రామజోగయ్య శ్రాస్తి, ఆర్ట్: రామకుమార్.ఎ, ఎడిటింగ్: ఉపేంద్ర, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రవికుమార్ సానా, సంగీతం: కామ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివమల్లాల, రాధాకృష్ణ భట్టార్, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్, కథ, దర్శకత్వం: రాజ కిరణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments