మోనాల్‌కి మంచి కాంపిటీషన్‌గా స్వాతి దీక్షిత్ ఎంట్రీ..

  • IndiaGlitz, [Saturday,September 26 2020]

ఇవాళ షోలో ఏమీ లేదనిపించినా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. నిన్నటి రోబో, మనుషుల టాస్క్ గురించి కంటెస్టెంట్స్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా దివి, అభిల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ప్రశాంతంగానే ముగిసింది.అనంతరం నోయెల్‌కు విధించిన జైలు శిక్షా కాలం పూర్తయిందని బిగ్‌బాస్ చెప్పారు. ఇక నోయెల్‌ని జైలు నుంచి సందడి సందడిగా బయటకు తీసుకొచ్చారు. గంగవ్వకు అఖిల్ నచ్చుతాడట.. మోనాల్ నచ్చదట. ఇక దివిని రోబోల టీం హౌస్‌లోకి పట్టుకుపోయినప్పుడు ఎవరెవరు ఎలా చేశారో గంగవ్వ చేసి చూపించింది. ఇక కెప్టెన్సీ టాస్క్.. ‘రంగు పడిద్ది జాగ్రత్త’. అఖిల్ సంచాలకుడిగా టాస్క్ స్టార్ట్ అయింది. దివి వెళ్లి అఖిల్ పాట్‌ని ఖాళీ చేసేసింది. ఆ తరువాత అవినాష్, హారిక పాట్‌‌లలోని రంగు నీళ్లన్నీ పారబోశారు. గంగవ్వ జోలికైతే ఎవరూ వెళ్లలేదు. దీంతో గంగవ్వ కెప్టెన్సీ టాస్క్‌ను విన్ అయింది.

తరువాత అమ్మ రాజశేఖర్‌ని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేశారు. ఇక నోయెల్‌తో ఏం మాట్లాడావని మోనాల్‌ని అభి అడిగాడు. నేను నిన్ను లైక్ చేశానని చెప్పానని మోనాల్ చెప్పగా.. అభి చాలా ఎగ్జైట్ అయ్యాడు. నాకు చెప్పవే అవన్నీ అని అడిగాడు. అఖిల్, మోనాల్ మాట్లాడుకోవట్లేదని గంగవ్వ.. అవినాష్, అమ్మ రాజశేఖర్‌కి చెప్పింది. మోనాల్ అఖిల్‌తో మాట్లాడటానికి ట్రై చేస్తోంది కానీ అఖిల్ మాట్లాడట్లేదని చెప్పింది. ఇక బిగ్‌బాస్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ పనిష్మెంట్ ఇచ్చారు. అంతా సీరియస్‌గా ఉంటే సుజాత నవ్వడం కంటెస్టెంట్లకు కోపం తెప్పించింది. అఖిల్ కోపంతో ఉన్నాడన్న విషయం తనకు అర్థమైందని మోనాల్ చెప్పడంతో పాటు సారీ చెప్పింది. నేను వెంటనే సెట్ అవలేనని.. నువ్వేం ఇక్కడకు నన్ను పెళ్లి చేసుకోవడానికి రాలేదని అఖిల్ చెప్పాడు. సడెన్‌గా బుట్ట బొమ్మ సాంగ్‌తో స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఒక దేవత వెలిసింది.. మా కోసమేనంటూ అవినాష్ సాంగ్ పాడి సందడి చేశాడు. మొత్తానికి మోనాల్‌కి మంచి కాంపిటీషన్ వచ్చిందనే చెప్పాలి. అభి కూడా ఇంట్రెస్టింగ్ అని చెప్పాడు.

ఇంట్లోని మగవాళ్ల కోసం స్వాతి ఒక సర్‌ప్రైజ్ తీసుకొచ్చిందని.. ఆమెను మెప్పించిన వారికి ఆ సర్‌ప్రైజ్ దక్కుతుందని బిగ్‌బాస్ చెప్పారు. ఇక ఆమెను మెప్పించే పనిలో కంటెస్టెంట్లంతా పడిపోయారు. ఇక అఖిల్‌లో అద్భుతమైన సింగర్ ఉన్నాడని ఇవాళే తెలిసింది. ఇక అభి కూడా పాటతోనే స్వాతిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. నోయెల్ ఎలాగూ సింగరే కాబట్టి తను కూడా పాటతోనే ట్రై చేశాడు. ఫస్ట్ అఖిల్‌కి చాలా బాగా పాడావని స్వాతి రోజ్ ఇచ్చింది. తరువాత అమ్మ రాజశేఖర్, నోయెల్, తరువాత పిలవకుండానే వెళ్లి అవినాష్ రోజ్ తీసుకున్నాడు. బిగ్‌బాస్ ఇచ్చిన సర్‌ప్రైజ్.. లాంజ్ ఓపెనింగ్.. అయితే స్వాతితో పాటు ఆమె రోజ్ ఇచ్చిన నలుగురికి మాత్రమే లాంజ్‌లోకి ఎంట్రీ.. లోపల అద్భుతమైన పార్టీని బిగ్‌బాస్ ఎరేంజ్ చేశాడు. పార్టీ మంచి జోష్ ఉన్న సాంగ్స్‌తో అద్భుతంగా నడిచింది. సొహైల్, మెహబూబ్‌ల మధ్య కాన్వర్సేషన్. ఏదో మిస్ అవుతున్నామని సొహైల్. మనం టాస్కుల్లో చింపేస్తున్నాం కానీ అమ్మాయిలతో కలవకపోతే కష్టమని మెహబూబ్ హితబోధ. ఇక అఖిల్‌కి మోనాల్ బయటి నుంచి ఫుడ్ తినిపిస్తోంది. స్వాతి ఎలా ఉందని అఖిల్‌ని మోనాల్ అడిగింది గుడ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక స్వాతితో అభి మీటింగ్.. హౌస్‌లో ఏం జరుగుతోందో క్లుప్తంగా చెప్పాడు. మొత్తానికి నేటి షో సందడిగానే ముగిసింది.